Veena George: వయనాడుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. మంత్రి వీణాజార్జ్‌కు గాయాలు

En route Wayanad Kerala Health Minister Veena George injured in accident
ప్రకృతి బీభత్సం సృష్టించి వందలాది మందిని బలితీసుకున్న వయనాడ్‌కు వెళ్తుండగా కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో గాయపడిన ఆమె ప్రస్తుతం మంజేరిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నారు.

ఆమె ప్రయాణిస్తున్న కారు మంజేరిలో తొలుత ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఆపై ఓ ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టి ఆగింది. ఈ ఘటనలో ఆమె ముఖం, చేతులకు స్వల్పంగా గాయాలయ్యాయి. కోలుకున్న అనంతరం ఆమె వయనాడ్ వెళ్లే అవకాశం ఉంది. 

ఈ ఘటనలో గాయపడిన ద్విచక్ర వాహనదారుడికి కూడా చికిత్స అందిస్తున్నారు. కాగా, కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 153కు చేరుకోగా, ఇంకా 98 మంది జాడ తెలియరాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Veena George
Kerala
Wayanad

More Telugu News