Thummala: గతంలో కంటే భిన్నంగా త్వరలో రైతు భరోసా విధివిధానాలు: తుమ్మల నాగేశ్వరరావు

Tummala Nageswara Rao about Rythu Bharosa
  • రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని వ్యాఖ్య
  • రూ.31 వేల కోట్ల రుణమాఫీ ఒకే పంట కాలంలో చేస్తున్నట్లు వెల్లడి
  • పంటల బీమా ద్వారా రైతులకు అండగా ఉంటామని హామీ
రైతు భరోసా విధివిధానాలను రూపొందిస్తున్నామని, గతంలో కంటే భిన్నంగా సిద్ధం చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నిన్న రెండో విడత రైతు రుణమాఫీ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామన్నారు. రూ.31 వేల కోట్ల రుణమాఫీ ఒకే పంట కాలంలో చేస్తున్నట్లు చెప్పారు.

పంటల బీమా ద్వారా రైతులకు అండగా ఉంటామన్నారు. త్వరలో రైతు భరోసా విధివిధానాలు సిద్ధమవుతాయన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగు చేయాలని ఆయన రైతులను కోరారు. దీనిపై ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. ఐదేళ్లలో 5 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ వేయాలని రైతులను కోరుతున్నామన్నారు.
Thummala
Rythu Bharosa
Telangana

More Telugu News