కుమారుడి పుట్టిన రోజు.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం!
- పుట్టినరోజున కుమారుడి వీడియోను షేర్ చేసిన పాండ్యా
- కొడుకుపై తన ప్రేమ మాటలకందనిదని భావోద్వేగం
- తండ్రికి అగస్త్య ఫ్లయింగ్ కిస్‌లు చూసి మురిసిపోతున్న అభిమానులు
ఈ తండ్రీతనయుల వీడియో జనాలకు కూడా బాగా నచ్చడంతో లక్షల కొద్దీ వ్యూస్, వేల కొద్దీ కామెంట్స్ వచ్చి పడ్డాయి. హార్దిక్ ఓ అదర్శవంతమైన తండ్రి అని కొందరు అన్నారు. పలువురు చిన్నారికి కూడా శుభాకాంక్షలు తెలిపారు.
హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ ఇటీవలే తమ వైవాహిక బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. 2020లో ఈ జంటకు పెళ్లి కాగా, ఆ తరువాత వారు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తాజాగా వారు తమ నాలుగేళ్ల దాంపత్య బంధానికి ముగింపు పలుకుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇదిలా ఉంటే, నటాషా కూడా ఈ మధ్య కాలంలో తన కుమారుడికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలను నెట్టింట పంచుకుంది. ఇటీవల తల్లీకొడుకులు ఓ డైనోసార్ థీమ్ పార్క్‌ను సందర్శించిన సందర్భంగా తీసిన ఫొటోలను నెట్టింట షేర్ చేసింది.