Chandrababu: ఎల్లుండి అనంతపురం జిల్లా గుండుమల గ్రామానికి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

Chandrababu will visit Gundumala village in Anantapur district on Aug 1
  • ఆగస్టు 1న శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన
  • శ్రీశైలం డ్యామ్ కుడిగట్టు విద్యుత్ కేంద్రం సందర్శన
  • సాగునీటి వినియోగదారులతో ముఖాముఖి సమావేశం
  • అనంతరం అనంతపురం జిల్లా పర్యటనకు పయనం
  • గుండుమల గ్రామంలో పెన్షన్ల పంపిణీని స్వయంగా పర్యవేక్షించనున్న సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు ఎల్లుండి (ఆగస్టు 1) శ్రీశైలంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణా నదికి జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం శ్రీశైలం డ్యామ్ కుడిగట్టు విద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు. సాగునీటి వినియోగదారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు. 

శ్రీశైలంలో పర్యటన ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాలోని గుండుమల గ్రామంలో చంద్రబాబు పెన్షన్ల పంపిణీని స్వయంగా పర్యవేక్షించనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అనంతపురం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Chandrababu
Gundumala
Anantapur District
Srisailam
TDP
Andhra Pradesh

More Telugu News