Donald Trump: హత్యాయత్నం ఘటనలో ఎఫ్‌బీఐ ముందుకు డొనాల్డ్ ట్రంప్

Donald Trump has agreed to be interviewed by the FBI in connection with the assassination attempt on him
  • అడిగిన వివరాలు తెలిపేందుకు అంగీకరించిన రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి
  • డొనాల్డ్ ట్రంప్‌తో ప్రత్యక్షంగా మాట్లాడనున్న అధికారులు
  • జులై 6న ట్రంప్‌పై తుపాకీతో కాల్పులు జరిపిన థామస్ క్రూక్ అనే దుండగుడు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. జులై 13న పెన్సిల్వేనియాలో ర్యాలీలో పాల్గొన్న ఆయనపై థామస్ క్రూక్స్ అనే దుండగుడు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చేయి నుంచి దూసుకెళ్లడంతో ఆయనకు స్వల్ప గాయమైంది. అయితే ఈ హత్యాయత్నం ఘటనపై అధికారులు కోరే వివరాలు తెలిపేందుకు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఈ మేరకు ఆయన విచారణకు హాజరు కానున్నారని ఎఫ్‌బీఐ తెలిపింది. కాగా నేర పరిశోధనలో భాగంగా బాధితులతో మాట్లాడడం ఎఫ్‌బీఐ ప్రోటోకాల్‌గా ఉంది. అందులో భాగంగానే ట్రంప్ హాజరు కానున్నారు.

ట్రంప్ అభిప్రాయాలను కూడా తీసుకోవాలని భావిస్తున్నట్టు ఎఫ్‌బీఐ ప్రత్యేక ప్రతినిధి ఒకరు చెప్పారు. నేర బాధితులతో తాము మాట్లాడుతుంటామని, అందులో భాగంగానే ట్రంప్‌ను విచారించనున్నట్టు తెలిపారు.
Donald Trump
USA
FBI

More Telugu News