Pawan Kalyan: పథకాలకు వారి పేర్లు పెడుతున్న చంద్రబాబుకు ధన్యవాదాలు: పవన్

Pawan Kalyan comments on Jagan
ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పథకాలన్నింటికీ జగన్ తన పేరే పెట్టుకున్నారని పవన్ విమర్శించారు. బడిపిల్లల సామగ్రి పథకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్, మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేర్లను పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. అలాగే, విద్యార్థులకిచ్చే ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు పెట్టడం సముచితంగా ఉందని చెప్పారు. ఆ మహనీయుల ఆశీస్సులు తమ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉంటాయని పవన్ పేర్కొన్నారు.
Pawan Kalyan
Chandrababu
Janasena

More Telugu News