Allahabad High Court: గర్భాన్ని ఉంచుకోవాలా? తొలగించుకోవాలా? అనేది మహిళ ఇష్టం: అలహాబాద్ హైకోర్టు

 Allahabad High Court Comments On Abortion
  • అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 15 ఏళ్ల బాలిక
  • గర్భ విచ్ఛిత్తి వల్ల ప్రమాదమంటూ బాలిక, కుటుంబ సభ్యులకు వైద్యుల కౌన్సెలింగ్
  • గర్భాన్ని ఏం చేయాలన్న నిర్ణయాన్ని ఆమె తప్ప మరెవరూ తీసుకోలేరని అభిప్రాయపడిన ధర్మాసనం
  • గర్భాన్ని కొనసాగించాలనుకుంటే ఆ విషయాన్ని ప్రైవేటుగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టీకరణ
గర్భాన్ని ఉంచుకోవాలా? తొలగించుకోవాలా? అనేది మహిళ ఇష్టమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. 32 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా 15 ఏళ్ల అత్యాచార బాధితురాలు ఒకరు కోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది. 

బాధిత బాలిక తన గర్భాన్ని కొనసాగించి పుట్టే బిడ్డను దత్తతకు ఇవ్వావాలనుకుంటే అలాగే చేయొచ్చని, అయితే ఈ విషయాన్ని వీలైనంత ప్రైవేటుగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. గర్భ విచ్ఛిత్తి వల్ల ప్రమాదం పొంచి వుందన్న వైద్యుల కౌన్సెలింగ్ తర్వాత బాలిక, ఆమె తల్లిదండ్రులు గర్భాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

‘‘ఆమె తన గర్భాన్ని తొలగించుకోవాలా? వద్దా? అన్న నిర్ణయాన్ని ఆమె తప్ప మరెవరూ తీసుకోకూడదని కోర్టు అభిప్రాయపడింది’’ అని  జస్టిస్ శేఖర్ బీ సరఫ్, జస్టిస్ మంజీవ్ శుక్లాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Allahabad High Court
Pregnancy
Abortion
Medical Termination

More Telugu News