Emaindho manase: 'యావరేజ్ స్టూడెంట్ నాని' నుంచి 'ఏమైందో మనసే' లిరికల్ వీడియో విడుదల

Another lyrical video out from Average Student Nani movie
'మెరిసే మెరిసే' సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన పవన్ కుమార్ కొత్తూరి సక్సెస్ అందుకున్నారు. పవన్ కుమార్ తన రెండో సినిమా 'యావరేజ్ స్టూడెంట్ నాని'తో హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. 

ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. గతంలో విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగిల్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ లోనే తన ఎక్స్ ప్రెషన్స్, పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు పవన్ కుమార్. ఈ రోజు సెకండ్ సింగిల్ ‘ఏమైందో మనసే’ అనే పాటను రిలీజ్ చేశారు.

పూర్తి రొమాంటిక్ మోడ్‌లో సాగే ఈ మెలోడీ పాటకు కార్తీక్ బి. కొడకండ్ల బాణీలు అందించారు. కృష్ణవేణి మల్లవజ్జల సాహిత్యం సమకూర్చారు. శక్తి శ్రీ గోపాలన్ ఆలపించారు. ఈ పాటలో పవన్, సాహిబా భాసిన్ స్టీమీ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇందులో పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ మాల్వియ, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి తదితరులు నటించారు. పీవీఆర్ ఐనాక్స్ ద్వారా ఆగస్ట్ 2న ఈ చిత్రం విడుదల కానుంది.
Emaindho manase
Lyrical Video
Average Student Nani

More Telugu News