NEET: నీట్ సవరించిన ఫలితాలపై అయోమయం... స్పష్టత నిచ్చిన విద్యాశాఖ

Union education dept clarifies on NEET revised results
  • నేడు నీట్ ఫలితాలు విడుదలైనట్టు వార్తలు
  • ఎన్టీయే వెబ్ సైట్ లో ఓపెన్ కాని లింకు
  • వెబ్ సైట్లో ఉన్నది పాత లింకు అని విద్యాశాఖ వెల్లడి
  • త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని స్పష్టీకరణ
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో నేడు నీట్ యూజీ తుది ఫలితాలను ఎన్టీయే విడుదల చేసినట్టు వార్తలు వచ్చాయి. నీట్ సవరించిన ఫలితాలు (నీట్ రివైజ్డ్ స్కోర్ కార్డ్) పేరిట ఓ లింక్ ఎన్టీయే వెబ్ సైట్ లో కనిపించడంతో... అందరూ ఫలితాలు విడుదలయ్యాయనే అనుకున్నారు. అయితే ఈ లింకు ఓపెన్ కాకపోవడంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. 

దాంతో కేంద్ర విద్యాశాఖ వివరణ ఇచ్చింది. ఎన్టీయే వెబ్ సైట్లో ఉన్నది పాత లింకు అని, ఆ లింక్ చూసి స్కోర్ కార్డ్ లు ప్రకటించినట్టుగా భావించారని పేర్కొంది. సవరించిన స్కోర్ కార్డులు ఇంకా విడుదల చేయలేదని స్పష్టం చేసింది. త్వరలోనే ఫలితాలపై అధికారిక ప్రకటన ఉంటుందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
NEET
Revised Results
NTA
Education Dept

More Telugu News