Nara Lokesh: డోంట్ వర్రీ అమ్మా... నేను చూసుకుంటా: ఒమన్ లో కష్టాలు పడుతున్న మామిడి దుర్గకు మంత్రి నారా లోకేశ్ భరోసా

Nara Lokesh assures safe return of Mamidi Durga from Oman
  • ఒమన్ వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయిన ఏపీ యువతి మామిడి దుర్గ
  • ఆరోగ్యం బాగాలేదంటూ కన్నీటి పర్యంతం
  • నువ్వే కాపాడాలన్నా అంటూ లోకేశ్ కు విజ్ఞప్తి
  • వెంటనే స్పందించిన నారా లోకేశ్
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోతున్న వారు తిరిగి రాలేక, అక్కడ ఇమడలేక అష్టకష్టాలు పడుతున్నారు. కొందరు తమ గోడును వీడియోల రూపంలో వెళ్లబోసుకోగా, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇటీవలే చొరవ చూపి కువైట్ నుంచి శివ అనే కార్మికుడిని స్వస్థలానికి రప్పించారు. 

తాజాగా, మామిడి దుర్గ అనే యువతి కూడా ఇదే రీతిలో ఒమన్ లో చిక్కుకుపోయి ఆరోగ్యం బాగాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏజెంట్ చేతిలో మోసపోయానని, ఆరోగ్యం దెబ్బతిన్నదని, తనను స్వస్థలానికి చేర్చాలంటూ నారా లోకేశ్ కు విజ్ఞప్తి చేసింది. ఆ వీడియోలో మామిడి దుర్గ కన్నీటిపర్యంతమైంది. 

ఆమె పరిస్థితి పట్ల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. "ఇక నువ్వు బాధపడొద్దమ్మా... నేను చూసుకుంటాను. ఇప్పుడే నీ విషయాన్ని ఎన్నారై టీడీపీ వాళ్లకు వివరిస్తాను. వాళ్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ నిన్ను కాపాడతారు. వీలైనంత త్వరలో నిన్ను స్వస్థలానికి చేర్చే ఏర్పాట్లు చేస్తారు' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. మామిడి దుర్గ వీడియోను కూడా లోకేశ్ పంచుకున్నారు.
Nara Lokesh
Mamidi Durga
Oman
Andhra Pradesh
TDP

More Telugu News