USA Travel Advisory: అమెరికా ట్రావెల్ అడ్వైజరీ మామూలే: విదేశాంగశాఖ స్పందన

MEA spokesperson Randhir Jaiswal dubbed the USA advisory as a routine exercise of any country
  • ఏ దేశానికైనా ఇది సాధారణమేనన్న విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్
  • మీడియా సమావేశంలో అమెరికా అడ్వైజరీపై స్పందన
భారత్‌లోని మణిపూర్, జమ్మూ కశ్మీర్, ఇండియా-పాకిస్థాన్ బార్డర్‌‌తో పాటు దేశంలోని తూర్పు, మధ్య భాగాల్లోని పలు ప్రాంతాలకు వెళ్లవద్దంటూ తమ దేశ పౌరులకు అమెరికా చేసిన ట్రావెల్ అడ్వైజరీపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. అమెరికా ట్రావెల్ అడ్వైజరీ మామూలు విషయమేనని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు. ఏ దేశమైనా ఇది మామూలుగా ఇచ్చే అడ్వైజరీ అనే అన్నారు. వారానికోసారి నిర్వహించే విలేకరుల సమావేశంలో భాగంగా గురువారం ఆయన ఈ విధంగా స్పందించారు.

కాగా నేరాలు, ఉగ్రవాదులు, నక్సలైట్ల సమస్య కారణంగా భారత్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లవద్దంటూ అమెరికా బుధవారం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. గతంలో జారీ చేసిన సలహాను సవరించి ఈ తాజా అడ్వైజరీని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ జారీ చేసింది. నేరాలు, ఉగ్రవాదం కారణంగా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, కొన్ని ప్రాంతాల్లో ప్రయాణం చాలా ప్రమాదకరమని పేర్కొంది.

మొత్తంగా భారతదేశాన్ని లెవల్-2 ప్రమాదకరమని పేర్కొంది. అయితే అమెరికా సూచించిన చాలా ప్రాంతాలు లెవల్ 4 కేటగిరిలో ఉండడం గమనార్హం. జమ్మూ కశ్మీర్, ఇండియా-పాకిస్థాన్ బార్డర్, మణిపూర్, మధ్య, తూర్పు భారతంలోని పలు ప్రాంతాల్లో ప్రయాణం చేయవద్దని అమెరికన్లకు సూచించింది.  జమ్ము కశ్మీర్‌లో (తూర్పు లడఖ్ ప్రాంతం, రాజధాని లేహ్ మినహా) తీవ్రవాదం, పౌర అశాంతి ఉన్నాయని పేర్కొంది. సాయుధ పోరాటాలకు అవకాశం ఉన్న భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతానికి వెళ్లొద్దని వివరించింది. హింస, నేరాలు జరుగుతున్నందున మణిపూర్ రాష్ట్రానికి వెళ్లొద్దని పేర్కొంది.
USA Travel Advisory
USA
India

More Telugu News