Nara Bhuvaneswari: శివాపురం వద్ద సొంత ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షించిన నారా భువనేశ్వరి... ఫొటోలు ఇవిగో!

Nara Bhuvaneswari visits their own house construction at Shivapuram in Kuppam constituency
  • కుప్పం నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుంటున్న సీఎం చంద్రబాబు
  • నేడు శివాపురం విచ్చేసిన నారా భువనేశ్వరి
  • కాంట్రాక్టర్ తో మాట్లాడి పలు సూచనలు చేసిన వైనం
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన కుప్పం నియోజకవర్గంలో సొంత ఇల్లు నిర్మించుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని శివాపురం వద్ద ఇల్లు నిర్మిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, తమ సొంత ఇంటి నిర్మాణ పనులను చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు పర్యవేక్షించారు. పనులు సాగుతున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్ కు ఆమె పలు సూచనలు చేశారు. 

చంద్రబాబుకు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం కంచుకోట. ఆయన ఇక్కడ్నించి వరుసగా ఎనిమిదిసార్లు విజయభేరి మోగించారు. అయితే, సొంత నియోజకవర్గంలో ఇల్లు లేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. విమర్శలకు అడ్డుకట్టవేయాలని భావించి ఆయన ఇంటి నిర్మాణం చేపట్టారు.
Nara Bhuvaneswari
House
Shaivapuram
Chandrababu
Kuppam
TDP

More Telugu News