Nepal: నేపాల్ రాజధాని ఖాట్మాండులో కుప్పకూలిన విమానం

Saurya Airlines Flight Crashes In Kathmandu
  • త్రిభువన్ విమానాశ్రయంలో టేకాఫ్ తీసుకునే సమయంలో కూలిన విమానం
  • విమానంలో సిబ్బంది సహా 19 మంది 
  • ఉదయం 11 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలిపిన అధికారులు
నేపాల్ రాజధాని ఖాట్మాండు‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. త్రిభువన్ విమానాశ్రయంలో ఓ విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో సిబ్బంది సహా 19 మంది ఉన్నారు. ఈ విమానం పోఖరాకు వెళ్తోంది. ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలియగానే ప్రమాదస్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు. మంటలు చెలరేగడంతో ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను వెలికి తీశారు. విమానం పైలట్ కెప్టెన్ మనీష్ షాక్యాను రక్షించిన సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. టేకాఫ్ సమయంలో విమానం రన్‌వే పైనుంచి జారిపడి కూలిపోయింది. కూలిన విమానం శౌర్య ఎయిర్ లైన్స్‌కు చెందినది.
Nepal
Airlines
Fire Accident

More Telugu News