Volunteer: వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం: మంత్రి డోలా వీరాంజనేయస్వామి

Volunteers In AP Will Continue Says Minister Dola Veeranjaneya Swamy
  • వైసీపీ నేత శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానం
  • గౌరవ వేతనం పెంపుపైనా కసరత్తు చేస్తున్నట్టు వెల్లడి
  • ఊపిరి పీల్చుకున్న 2 లక్షల మంది వలంటీర్లు
వలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా? లేదా? అన్న సందిగ్ధతకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం తెరదించింది. వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మంత్రి డోలా వీరాంజనేయస్వామి ప్రకటించారు. దీంతో 2 లక్షలమందికిపైగా ఉన్న వలంటీర్లు ఊపిరి పీల్చుకున్నారు.

వలంటీర్ వ్యవస్థపై స్పష్టత ఇవ్వాలంటూ వైసీపీ నేత శివప్రసాద్‌రెడ్డి నిన్న సభలో ప్రభుత్వాన్ని కోరారు. దీనికి మంత్రి వీరాంజనేయులు సమాధానమిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అలాగే, వారికి ఇస్తున్న గౌరవ వేతనం పెంపుపై కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు.

నిజానికి నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. ఢిల్లీలో నిరసన కోసం వెళ్లారు. అయితే, అంతకుముందే వైసీపీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సభకు నివేదించిన ప్రశ్నకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు.
Volunteer
Andhra Pradesh
Dola Sree Bala Veeranjaneya Swamy
Telugudesam

More Telugu News