Gangavaram Port: అదానీ గంగవరం పోర్టులో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం

Fire Accident in Adani Gangavaram Port
అదానీకి చెందిన గంగవరం పోర్టులో గత అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వినియోగంలో లేని నంబర్ 13 కన్వేయర్ బెల్టు సైలో మెషీన్ ఏరియాలో వెల్డింగ్ చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసిపడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది బొగ్గు లోడింగ్, అన్‌లోడింగ్ జరిగే ప్రాంతం కావడంతో మంటలు అంటుకుని ఎగసిపడ్డాయి. దీంతో కార్మికులు భయాందోళనలకు గురయ్యారు.

వెంటనే అప్రమత్తమైన అక్కడి రెండు అగ్నిమాపక శకటాలతో పాటు, పెదగంట్యాడ నుంచి వచ్చిన మరో అగ్నిమాపక శకటం మంటలను అదుపు చేశాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అయితే, ఇది స్వల్ప ప్రమాదమేనంటూ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
Gangavaram Port
Gautam Adani
Visakhapatnam

More Telugu News