Maddali Giri: వైసీపీకి రాజీనామా చేసిన మద్దాళి గిరి

Maddali Giri resigns for YSRCP
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నట్టు పేర్కొన్నారు.  

మద్దాళి గిరి 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఓసారి ఆయన అప్పటి సీఎం జగన్ ను కలవగా, పర్యవసానంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఇన్చార్జి పదవి నుంచి మద్దాళి గిరిని టీడీపీ తప్పించింది. 

కాలక్రమంలో ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. అయితే, ఇటీవలి ఎన్నికల్లో మద్దాళి గిరికి టికెట్ లభించలేదు. గుంటూరు వెస్ట్ టికెట్ ను మాజీ మంత్రి విడదల రజనికి కేటాయించారు. చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమానికి బదిలీ అయిన విడదల రజని ఎన్నికల్లో ఓడిపోయారు.
Maddali Giri
YSRCP
Resignation
Guntur West
TDP

More Telugu News