కొత్త కోచ్ గంభీర్ తో కలిసి శ్రీలంక పర్యటనకు బయల్దేరిన టీమిండియా
- జులై 27 నుంచి శ్రీలంకలో టీమిండియా పర్యటన
- మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్న టీమిండియా
- ఈ పర్యటనతో టీమిండియా కోచ్ గా గంభీర్ ప్రస్థానం ప్రారంభం
టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్ తో ముగియగా, ద్రావిడ్ స్థానంలో టీమిండియా ప్రధాన కోచ్ గా గంభీర్ నియమితుడయ్యాడు. టీమిండియా కోచ్ గా గంభీర్ ప్రస్థానం శ్రీలంక టూర్ తో ప్రారంభం కానుంది.
శ్రీలంకతో టీమిండియా ఈ నెల 27 నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ జరగనుంది. టీ20ల్లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తుండగా, వన్డేల్లో రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగనున్నాడు.