Heavy Rains: భారీ వర్షాల ఎఫెక్ట్... అల్లూరి జిల్లాలోని ఘాట్ రోడ్ల మూసివేత

Due to heavy rains ghat roads in Alluri district are closed till morning
  • బంగాళాఖాతంలో వాయుగుండం
  • ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్ల మూసివేత
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో... అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఘాట్ రోడ్లను మూసివేశారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు జిల్లాలోని ఘాట్ రోడ్లను మూసి ఉంచుతారు. ఈ మేరకు పాడేరు, అరకు, చింతపల్లి, మారేడుమిల్లి ఘాట్ రోడ్లను మూసివేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఘాట్ రోడ్లను మూసివేస్తూ అల్లూరి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Heavy Rains
Ghat Roads
Alluri District

More Telugu News