KTR: ఆర్ నారాయణమూర్తిని ఫోన్‌లో పరామర్శించిన కేటీఆర్

KTR phoned R Narayanamurthy
  • రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన నారాయణమూర్తి
  • నిమ్స్‌లో చికిత్స పొందుతున్న నారాయణమూర్తి
  • అన్ని విధాలుగా అండగా ఉంటామని ఫోన్ చేసి చెప్పిన కేటీఆర్
అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. అన్ని విధాలుగా ఆయనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఆర్ నారాయణ మూర్తి రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆర్‌ నారాయణ మూర్తికి చికిత్స అందిస్తున్నారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నట్టు డాక్టర్లు వెల్లడించారు.
KTR
R Narayana Murthy
Telangana

More Telugu News