బోటులో మంటలు.. 40 మంది హైతీ వలసదారుల సజీవ దహనం
- హైతీలో పెచ్చుమీరుతున్న తీవ్రవాదం
- హింస భరించలేక దేశాన్ని వీడుతున్న హైతీలు
- ప్రమాద సమయంలో బోటులో దాదాపు 80 మంది
- 41 మందిని రక్షించిన హైతీ కోస్ట్‌గార్డ్
ప్రయాణం క్షేమంగా సాగాలంటూ బోటులోని ప్రయాణికులు కొవ్వొత్తులు వెలగించి ప్రార్థించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా హైతీలో తీవ్రవాద ముఠాలు చెలరేగి మారణహోమం సృష్టిస్తుండడంతో హైతీలు అక్రమ మార్గాల ద్వారా వలసలు వెళ్తూ ఇలా ప్రమాదాల బారినపడి ప్రాణాలు విడుస్తున్నారు.