సీఎం చంద్రబాబు కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజమౌళి నియామకం
ఏపీకి చెందిన రాజమౌళి 2003 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. రాజమౌళి... సీఎం కార్యదర్శిగా పనిచేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కార్యదర్శిగా వ్యవహరించారు. 2015 నుంచి 2019 వరకు ఆయన సీఎంవోలో పనిచేశారు.