YS Sharmila: తెలంగాణలో రేవంత్ చేసినట్టే... ఏపీలో రుణమాఫీ చేయాలి: షర్మిల

Sharmila demands AP Govt for farmers loan waiver
  • తెలంగాణలో రుణమాఫీ చేయడంపై షర్మిల హర్షం 
  • ఏపీ రైతులు అన్ని విధాలుగా చితికిపోయారని వ్యాఖ్య 
  • రుణమాఫీ చేసి ఆదుకోవాలని విన్నపం
తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన వరం రుణమాఫీ అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కొనియాడారు. రుణమాఫీతో రైతుల కళ్లలో ఆనందం తిరిగి వచ్చిందని చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విధంగానే ఏపీ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. 15 ఏళ్ల క్రితం దేశ వ్యాప్తంగా ఒకే విడత రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు. ఎన్నికల వేళ రాహుల్ గాంధీ చేసిన వాగ్దానం సాకారమయిందని... తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. రైతుల తలసరి అప్పులో తొలి స్థానంలో ఉన్న ఏపీలో రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అన్ని విధాలుగా చితికిపోయిన రైతులకు రుణమాఫీ చేసి ఆదుకోవాలని కోరుతున్నామని చెప్పారు.
YS Sharmila
Congress
Revanth Reddy
Loan Waiver
Andhra Pradesh

More Telugu News