TDP: టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన పోలీసు అధికారుల సంఘం నేతలు

Police officers association leaders convyes apologies to TDP top brass
రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం నేతలు నేడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఒత్తిళ్ల కారణంగానే గతంలో చంద్రబాబును దూషించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. గత పరిణామాలు మనసులో పెట్టుకోవద్దని, తమను క్షమించాలని కోరారు. నాటి డీజీపీ రాష్ట్ర పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు అన్నారు. తమను పావులుగా వాడుకున్నారని, తాము చేసిన పనికి చాలా బాధపడ్డామని తెలిపారు.
TDP
Police
Officers
Andhra Pradesh

More Telugu News