Tulsi Gabbard: ఆమె స్వార్థపరురాలు.. కమలా హారిస్‌పై మండిపడ్డ అమెరికా చట్టసభల మాజీ సభ్యురాలు

Tulsi Gabbard Slams Kamala Harris Over Her Remarks Against JD Vance
  • అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌పై ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విమర్శలు
  • ట్రంప్‌కు జేడీ వాన్స్ రబ్బర్ స్టాంప్‌లా మారతారని ఘాటు వ్యాఖ్యలు
  • దేశం కోసం సైన్యంలో చేరిన వాన్స్‌ను విమర్శించడంపై చట్టసభసభ్యురాలు తులసీ గాబార్డ్ అభ్యంతరం 
  • కమల తన రాజకీయ లక్ష్యాల కోసం పనిచేస్తారని మండిపాటు
అమెరికా ఉపాధ్యక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జేడీ వాన్స్‌ను టార్గెట్ చేస్తూ ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ చేసిన విమర్శలపై మాజీ చట్టసభసభ్యురాలు తులసీ గాబార్డ్ మండిపడ్డారు. ఆమె స్వార్థపరురాలని విమర్శించారు. ఇలాంటి వాళ్లు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్‌ను ట్రంప్ ఎంపిక చేసిన తరువాత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్ర విమర్శలు చేశారు. జేడీ వాన్స్ రబ్బరు స్టాంపుగా మారతారని, ఆయన అమెరికాకు కాకుండా ట్రంప్‌కే విశ్వాసపాత్రంగా ఉంటారని విమర్శించారు. 2020 నాటి ఎన్నికల ఫలితాలను తాను ఆమోదించపోయి ఉండొచ్చన్న వాన్స్ వ్యాఖ్యలకు కమలా హారిస్ ఈ మేరకు స్పందించారు. దీనిపై తులసీ గాబార్డ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

‘‘ఇలాంటి మాటలు అనేందుకు కమలా హారిస్‌కు ఎంత ధైర్యం! 9/11 దాడుల తరువాత జేడీ వాన్స్ అమెరికా సైన్యంలో చేరారు. 2005లో ఇరాక్‌లో కూడా పనిచేశారు. దేశం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టేందుకు సిద్ధమయ్యారు. కమలా హారిస్ తన జీవితంలో ఇలా ఎప్పుడైనా చేశారా? ఇప్పుడు కూడా ఆమె స్వార్థపూరితంగా ప్రవర్తిస్తున్నారు. తన రాజకీయ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాళ్లు ప్రభుత్వ బాధ్యతలు నెత్తికెత్తుకోకూడదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Tulsi Gabbard
Kamala Harris
USA
JD Vance

More Telugu News