Vinukonda Murder: తమ కార్యకర్త రషీద్ హత్యపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన వైసీపీ

YCP Complaint To President Murmu About vinukonda Murder
  • ఏపీలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని ఆరోపణ
  • వెరీ బ్యాడ్ మార్నింగ్ అంటూ రాష్ట్రపతికి వైసీపీ ట్వీట్
  • రాష్ట్ర ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి
‘మేడం ప్రెసిడెంట్.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్’ అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైసీపీ ట్వీట్ చేసింది. ఏపీలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని ఆరోపించింది. రాష్ట్రపతి కలగజేసుకుని ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేసింది. ఈమేరకు గురువారం ఉదయం వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఆ పార్టీ పోస్టు పెట్టింది. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది.

వెంటనే ప్రెసిడెంట్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ విషయంలో ప్రతి భారతీయుడూ తమకు మద్దతు పలకాలని ట్వీట్ లో వైసీపీ కోరింది. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ బుధవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే, ఈ హత్యకు పాతకక్షలే కారణమని పల్నాడు ఎస్పీ శ్రీనివాస్ రావు మీడియాకు వెల్లడించారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యాయని, వైసీపీ నేతలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడుతున్నారు.
Vinukonda Murder
YCP
President Of India
Droupadi Murmu

More Telugu News