Revanth Reddy: రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Revanth Reddy comments on Loan Waiver
  • ప్రజాభవన్‌లో కాంగ్రెస్ నేతల సమావేశం
  • మూడు దఫాలుగా రైతు రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి
  • రేపు సాయంత్రం రూ.1 లక్ష, నెలాఖరు నాటికి రూ.1.5 లక్షల రుణమాఫీ
  • ఆగస్ట్‌లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి
రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... మూడు దఫాలుగా రైతు రుణమాఫీ చేయనున్నట్లు చెప్పారు. రేపు సాయంత్రం 4 గంటలలోగా రూ.1 లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామన్నారు. రేపు సాయంత్రం లోగా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు.

ఈ నెలాఖరులోగా రెండో దఫాలో లక్షన్నర రూపాయల వరకు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఆగస్ట్ నెలలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. 7 నెలల్లోనే సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారు. ఏకమొత్తంలో వీటిని మాఫీ చేస్తామని పేర్కొన్నారు.
Revanth Reddy
Congress
Telangana

More Telugu News