Nara Bhuvaneswari: విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు... సకాలంలో వైద్యసేవలు అందేలాజేసిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari helped to recover a traveler from illness while got to Tirupati
  • హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తున్న విమానం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడిన శశిధర్ అనే ప్రయాణికుడు
  • అదే విమానంలో ప్రయాణిస్తున్న నారా భువనేశ్వరి
  • ప్రయాణికుడు అస్వస్థతకు గురైన విషయాన్ని సీఎంవోకు తెలియజేసిన వైనం
  • ఎయిర్ పోర్టు వర్గాలను అప్రమత్తం చేసిన సీఎంవో సిబ్బంది
ఇవాళ హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురికాగా, అదే విమానంలో ప్రయాణిస్తున్న సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి చొరవతో ఆ ప్రయాణికుడికి సకాలంలో వైద్యసేవలు అందాయి. 

ఆ విమానంలో శశిధర్ అనే ప్రయాణికుడు శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. శశిధర్ ప్రయాణిస్తున్న విమానంలోనే నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురైన అంశాలన్ని ఆమె ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. 

వెంటనే స్పందించిన సీఎంవో సిబ్బంది విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. దాంతో తిరుపతి ఎయిర్ పోర్టులో విమానం వద్దకే డాక్టర్లను, అంబులెన్స్ ను తీసుకొచ్చారు. డాక్టర్లు సకాలంలో చికిత్స అందించడంతో ప్రయాణికుడు శశిధర్ కోలుకున్నాడు.
Nara Bhuvaneswari
CMO
Airport
Tirupati
Hyderabad

More Telugu News