Rammohan Naidu: నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

central minister rammohan naidu as special invitee of NITI aayog
నీతి అయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు నియమితులయ్యారు. కేంద్రంలో కొత్త మంత్రివర్గం ఏర్పడిన నేపథ్యంలో నీతి అయోగ్ కూర్పును సవరించారు. ఎక్స్ అఫీషియో సభ్యుల జాబితాలో కొత్త వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను చేర్చారు. 

ఇక ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో మంత్రులు జేపీ నడ్డా (వైద్య ఆరోగ్యం), కింజరాపు రామ్మోహన్ నాయుడు (పౌర విమానయానం), హెచ్‌డీ కుమారస్వామి (ఉక్కు, భారీ పరిశ్రమలు), జితన్‌రాం మాంఝీ (ఎంఎస్ఎంఈ), రాజీవ్ రంజన్ సింగ్ (పంజాయతీరాజ్, పశుసంవర్ధకం), జూయెల్ ఓరం (గిరిజన వ్యవహారాలు), అన్నపూర్ణాదేవి (మహిళా శిశు సంక్షేమం), చిరాగ్ పాశ్వాన్ (ఆహారశుద్ధి పరిశ్రమలు) ను చేర్చారు. 


Rammohan Naidu
Telugudesam
Niti Aayog

More Telugu News