Revanth Reddy: రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి

Revanth Reddy clarity on loan waiver
  • పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందన్న రేవంత్
  • కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన అని వెల్లడి
  • ఎల్లుండి సాయంత్రానికల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్న సీఎం
తెలంగాణలో పంట రుణాల మాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే రుణమాఫీకి రేషన్ కార్డు ఉండాలనే నిబంధన అందరినీ గందరగోళానికి గురి చేసింది. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పాస్ బుక్ ఆధారంగానే రూ. 2 లక్షల రుణమాఫీ ఉంటుందని ఆయన చెప్పారు. అయితే, కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టామని తెలిపారు. ఈ నెల 18లోపు రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. ఎల్లుండి సాయంత్రానికల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. రుణమాఫీ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.
Revanth Reddy
Congress
Loan waiver

More Telugu News