Venkiah Naidu: ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరం: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu responds on Telangana govt issues orders in Telugu for the first time
  • రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు
  • జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • అభినందించిన వెంకయ్యనాయుడు
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా, పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని ఎప్పటినుంచో సూచిస్తున్నానని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తాజాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణ మాఫీ మార్గదర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరం అని తెలిపారు. 

"ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు... ప్రజలకు సులువుగా అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించిన సమాచారం ఉండాలని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. ప్రజల సౌలభ్యానికి ప్రాధాన్యతనిస్తూ, తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారికి, ఈ ఉత్తర్వుల రూపకల్పనలో పాలుపంచుకున్న ఇతర అధికారులు, సిబ్బందికి అభినందనలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇక నుంచి అన్ని ఉత్తర్వులను, సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే అందించాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
Venkiah Naidu
Telugu
Telangana Govt
Revanth Reddy
Congress

More Telugu News