Biodiversity Flyover: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి కిందపడ్డ బైకర్.. స్పాట్ లోనే దుర్మరణం

Biker falls off flyover after Hitting A vehicle at Biodiversity
-
హైదరాబాద్ లోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ బైకర్ ఎగిరి ఫ్లైఓవర్ కింద పడ్డాడు. తీవ్రగాయాలు, రక్తస్రావంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని రాయదుర్గంకు చెందిన సుబ్బారావు (38) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బైక్ పై టిఫిన్లు అమ్ముకుంటూ సుబ్బారావు జీవనం సాగించేవాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి వెళుతుండగా.. వెనక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో సుబ్బారావు ఫ్లైఓవర్ కిందపడ్డాడని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Biodiversity Flyover
Road Accident
Biker Death
Hyderabad

More Telugu News