పంజాగుట్ట పీవీఆర్‌లో సినిమా నడుస్తుండగానే వర్షం.. తడిసి ముద్దయిన ప్రేక్షకులు.. వీడియో ఇదిగో!
పంజాగుట్టలోని పీవీఆర్ సినిమా హాల్‌లో ఏకంగా బయట కురిసినట్టే వర్షం పడింది. సినిమా నడుస్తుండగానే పైకప్పు నుంచి నీరు కారడంతో ప్రేక్షకులు తడిసిపోయారు. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన ప్రేక్షకులు సినిమా మధ్యలోనే బయటకు వెళ్లారు. టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆందోళనకు దిగారు.