Hyderabad: హైదరాబాదులోని పలు ప్రాంతాలను ముంచెత్తిన భారీ వర్షం

Heavy Rain lashes some areas in Hyderabad city
గత కొన్ని రోజులుగా హైదరాబాదులో దాదాపు ప్రతి రోజూ వర్షం పడుతోంది. ఇవాళ  కూడా సాయంత్రం హైదరాబాదులోని పలు ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, హైదర్ నగర్, కూకట్ పల్లి, మూసాపేట్, బాచుపల్లి, కేపీహెచ్ బీ కాలనీ, ప్రగతి నగర్, నిజాంపేట్, మల్కాజిగిరి, నేరేడ్ మెట్, కుషాయిగూడ, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈశాన్య రుతుపవనాలు క్రియాశీలకంగా ఉండడంతో పాటు, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
Hyderabad
Heavy Rain
Weather
Monsoon
Telangana

More Telugu News