Donald Trump: నా స్నేహితుడు ట్రంప్‌పై కాల్పులు తీవ్ర ఆందోళన కలిగించాయి: ప్రధాని మోదీ

Deeply concerned by the attack on my friend Says PM Narendra Modi
  • దాడిని తీవ్రంగా ఖండించిన భారత ప్రధాని
  • రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు చోటులేదన్న మోదీ
  • ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తన స్నేహితుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందానని అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసకు చోటులేదని వ్యాఖ్యానించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

కాగా శనివారం అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడే ఘటన జరిగింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ట్రంప్‌కు చెవి దగ్గర తీవ్రమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావమయింది. ఆయనకు ఎలాంటి ప్రాణహాని లేదు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా ట్రంప్‌పై కాల్పులు జరిపిన నిందితుడిని యూఎస్ సీక్రెట్ ఏజెంట్స్ క్షణాల్లోనే మట్టుబెట్టారు. ట్రంప్‌పైకి బులెట్ దూసుకెళ్లిన రెప్పపాటులోనే నిందితుడిని ఓ స్నైపర్ కాల్చివేశాడు.
Donald Trump
USA
Firing on Trump
Narendra Modi

More Telugu News