Etela Rajender: సీఎం కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదు... లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా: ఈటల రాజేందర్

Etala Rajendar to complaint Lok Sabha speaker about protocal issue
  • జేఎన్టీయూ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదన్న ఈటల రాజేందర్
  • అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆహ్వానం అందించలేదని విమర్శ
  • అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని కోరుతానని వెల్లడి
కూకట్‌పల్లి జేఎన్టీయూలో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తనకు ఆహ్వానం అందకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కార్యక్రమంలో స్థానిక ఎంపీ అయిన తనకు ఆహ్వానం పంపించకుండా అధికారులు ప్రోటోకాల్‌ను విస్మరించారన్నారు. ఈ అంశంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

ఉద్దేశపూర్వకంగానే తనకు ఆహ్వనం ఇవ్వలేదని... ఆహ్వానం పలకకుండా అవమానిచారంటూ మండిపడ్డారు. అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని లోక్ సభ స్పీకర్‌ను కోరుతానన్నారు. కనీసం శిలాఫలకంలో అయినా తన పేరు ఉందో లేదోనని ఆరా తీస్తున్నారన్నారు.
Etela Rajender
BJP
Revanth Reddy

More Telugu News