Urvashi Rautela: బాలకృష్ణ సినిమా షూటింగ్ లో గాయపడ్డ హీరోయిన్

Urvashi Rautela injured in Balakrishna film shooting
  • శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బాలయ్య 109వ చిత్రం
  • షూటింగ్ లో ఊర్వశి రౌతేలా కాలికి గాయం
  • కాలికి ఫ్రాక్చర్ అయిందన్న చిత్ర యూనిట్
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు సినిమా షూటింగులో గాయపడింది. బాలకృష్ణ నటిస్తున్న 109వ చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. షూటింగ్ కోసం ఊర్వశి రౌతేలా హైదరాబాద్ కు వచ్చింది. ఈమెపై ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. షూటింగ్ లో ఆమె గాయపడింది. గాయపడిన ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె కాలికి ఫ్రాక్చర్ అయిందని, వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చామని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం ఊర్వశి చికిత్స పొందుతోందని వెల్లడించింది. అయితే, ఆమె గాయం తీవ్రతపై క్లారిటీ రావాల్సి ఉంది.  

ఇక ఈ సినిమా విషయానికి వస్తే... బాలయ్య సరసన ఊర్వశితో పాటు తెలుగమ్మాయి చాందిని చౌదరి నటిస్తోంది. విలన్ గా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' ఫేమ్ బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా... థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Urvashi Rautela
Injury
Balakrishna

More Telugu News