Nara Lokesh: కేంద్రమంత్రి కుమారస్వామి ప్రకటన సంతోషాన్ని ఇచ్చింది: నారా లోకేశ్

Nara Lokesh happy with Union Minister Kumaraswamy on Vizag steel
  • ఉక్కు ప్రైవేటీకరణ లేదని ప్రకటించిన కేంద్రమంత్రి కుమారస్వామి
  • కేంద్రమంత్రి ఏపీ ప్రజల మనోభావాలను నిలబెట్టారన్న లోకేశ్
  • కేంద్రమంత్రి ప్రకటన నీలి మీడియాను నిరాశపరిచి ఉండవచ్చునని ఎద్దేవా
  • ప్రజల అంచనాలను అందుకోవడమే తమ మొదటి ప్రాధాన్యత అన్న లోకేశ్
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదంటూ కేంద్రమంత్రి చేసిన ప్రకటన సంతోషాన్ని ఇచ్చిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉక్కు ప్రైవేటీకరణ లేదని చెప్పడం ద్వారా కేంద్రమంత్రి కుమారస్వామి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను నిలబెట్టారన్నారు. ఇందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నానన్నారు.

విశాఖ ఉక్కు విషయమై కేంద్రమంత్రి చేసిన ప్రకటన నీలి మీడియాను నిరాశపరిచి ఉండవచ్చునని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల పట్ల అంకితభావంతో ఉందన్నారు. తమది ప్రజాప్రభుత్వమని... ప్రజల అంచనాలను అందుకోవడమే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు.

ఏపీలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

ఏపీలో 9 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఎస్పీఎఫ్ డీజీగా అంజనా సిన్హా కు బాధ్యతలు అప్పగించారు. లా అండ్ ఆర్డర్ డీజీగా సీహెచ్ శ్రీకాంత్‌ను, విజయవాడ సీపీగా రాజశేఖర్ బాబుకును నియమించారు. అగ్నిమాపక డీజీగా మాదిరెడ్డి ప్రతాప్, లాజిస్టిక్స్ ఐజీగా పీహెచ్‌డీ రామకృష్ణ, గ్రేహౌండ్స్ ఐజీగా గోపినాథ్ జెట్టి, కర్నూల్ రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్‌లకు పోస్టింగ్ ఇచ్చారు. పీహెచ్‌డీ రామకృష్ణకు పోలీస్ నియామక బోర్డ్ చైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Nara Lokesh
Kumaraswamy
Vizag Steel Plant
Telugudesam
NDA

More Telugu News