Telangana: తెలంగాణలో తాత్కాలికంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

Registration Services Stopped In Telangana
  • తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
  • గురువారం మధ్యాహ్నం నుంచి అంతరాయం ఏర్పడినట్లు వెల్లడి
  • రద్దీగా ఉన్నచోట్ల రేపు రావాలని సూచించామన్న అధికారులు
తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తెలిపింది. సాంకేతిక సమస్య కారణంగా గురువారం మధ్యాహ్నం నుంచి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌లకు ఆధార్ లింక్ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తినట్లు తెలిపారు. 

యూడీఐఏలో ఈకేవైసీ వెరిఫికేషన్‌కు సంబంధించి సాంకేతిక సమస్య ఉందని అధికారులు చెప్పారు. దీనిని పరిష్కరించేందుకు టెక్నికల్ నిపుణుల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు టెక్నికల్ సమస్య వల్ల ఇబ్బంది పడ్డట్లు తెలిపారు. సాంకేతిక సమస్య పరిష్కారమైతే వేచి ఉన్నవారి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. రద్దీగా ఉన్న చోట్ల మాత్రం రేపు రావాలని సూచించామన్నారు.
Telangana
Registrations

More Telugu News