Chandrababu: ప్రాంతీయ పార్టీలను గెలిపించుకుంటే ఢిల్లీలో చంద్రబాబులా చక్రం తిప్పవచ్చు!: కేటీఆర్

I hope people of Telangana are watching closely says ktr
  • ఏపీ అభివృద్ధికి చంద్రబాబు 1 ట్రిలియన్ రూపాయలు కేంద్రాన్ని అడిగినట్లుగా బ్లూమ్‌బర్గ్ కథనం
  • కథనాన్ని ట్వీట్ చేసిన జర్నలిస్ట్ మనేకా దోశి
  • తెలంగాణ ప్రజలు వీటినన్నింటినీ నిశితంగా గమనిస్తున్నారన్న కేటీఆర్
ప్రాంతీయ పార్టీలను గెలిపించుకుంటే ఢిల్లీలో ఎలా చక్రం తిప్పవచ్చునో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ ముందు పెడుతున్న డిమాండ్ల ద్వారా తెలుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చంద్రబాబు ప్రధాని మోదీ వద్ద తన డిమాండ్లను నెరవేర్చుకునే పని ప్రారంభించారని... ఏపీకి 1 ట్రిలియన్ (లక్ష కోట్లు) రూపాయల ఆర్థిక మద్దతు కోరినట్లుగా తెలుస్తోందంటూ బ్లూమ్‌బర్క్‌లో కథనం వచ్చింది. దీనిని మనేకా దోశి అనే జర్నలిస్ట్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. బ్లూమ్‌బర్గ్ నుంచి సోర్స్ అందినట్లు పేర్కొన్నారు.

మనేకా దోశి ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. ప్రాంతీయ పార్టీల‌ను గెలిపించుకుంటే ఢిల్లీలో ఎలా చ‌క్రం తిప్పవచ్చో... ఈ అంశం ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు వీటినన్నింటినీ నిశితంగా గ‌మ‌నిస్తున్నార‌ని ఆశిస్తున్నాన‌ని పేర్కొన్నారు. స్వీయ రాజ‌కీయ అస్థిత్వ‌మే తెలంగాణ‌కు శ్రీరామ‌ర‌క్ష అని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
Chandrababu
KTR
Telangana
Narendra Modi

More Telugu News