Chinthala Ramachandra Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు: బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి

Chinthala alleges CM Revanth Reddy encouraging of defections
  • సీఎంకు పార్టీ ఫిరాయింపులపై ఉన్న ప్రేమ నిరుద్యోగులపై లేదని విమర్శ
  • ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్న
  • 8 నెలలు గడుస్తున్నా ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదని మండిపాటు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సీఎంకు పార్టీ ఫిరాయింపులపై ఉన్న ప్రేమ నిరుద్యోగులపై లేదన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. చిక్కడపల్లి లైబ్రరీలో గ్రూప్ 1 పోస్టులపై చెప్పిన మాట ఏమైందన్నారు.

ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇది మరిచిపోయారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రియాంకగాంధీని తీసుకువచ్చి యూత్ డిక్లరేషన్ ప్రకటించారని గుర్తు చేశారు.
Chinthala Ramachandra Reddy
BJP
Congress
BRS

More Telugu News