VinFast: ఏపీ సీఎం చంద్రబాబుతో వియత్నాం ఆటోమొబైల్ సంస్థ ప్రతినిధుల భేటీ

VinFast automobile delegates held meeting with AP CM Chandrababu
  • రాష్ట్రానికి విచ్చేసిన విన్ ఫాస్ట్ బృందం
  • ఏపీలో పరిశ్రమ స్థాపించాలని ఆహ్వానించిన చంద్రబాబు
  • తమ భాగస్వామ్యం విజయవంతమవుతుందన్న ఆశాభావం
ఏపీ అభివృద్ధి దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ విన్ ఫాస్ట్ ప్రతినిధి బృందం నేడు రాష్ట్రానికి విచ్చేసింది. విన్ ఫాస్ట్ సీఈవో ఫామ్ సాన్ చౌ, ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు. దీనిపై చంద్రబాబు ట్వీట్ చేశారు. 

విన్ ఫాస్ట్... వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ సంస్థ అని వెల్లడించారు. ఆ సంస్థ సీఈవో ఫామ్ సాన్ చౌతో సమావేశమయ్యానని తెలిపారు. ఏపీలో విద్యుత్ ఆధారిత వాహనాలు, బ్యాటరీల తయారీ పరిశ్రమ స్థాపించాలని విన్ ఫాస్ట్ సంస్థను ఆహ్వానించానని చంద్రబాబు పేర్కొన్నారు.  

విన్ ఫాస్ట్ కంపెనీకి అనువైన భూములను పరిశీలించాల్సిందిగా పరిశ్రమల శాఖను ఆదేశించానని వివరించారు. విన్ ఫాస్ట్ సంస్థతో విజయవంతమైన భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.
VinFast
Vietnam
Chandrababu
Automobile
EV
Battery
Andhra Pradesh

More Telugu News