Nara Lokesh: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలంపై మంత్రి లోకేశ్ ఆగ్రహం

Nara Lokesh fires on ganja rage in Idupulapaya IIIT
  • మంత్రి నారా లోకేశ్ ను కలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు
  • ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని ఆవేదన
  • తమ పిల్లలను చేర్చి నష్టపోయామని వ్యాఖ్యలు
  • ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలంపై విచారణ జరపాలని లోకేశ్ ఆదేశం
కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి కలకలంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ఆదేశించారు. గంజాయిని ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 

ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి లోకేశ్ ను కలిశారు. తమ పిల్లలను చేర్పించి నష్టపోతున్నామంటూ వారు వాపోయారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని తెలిపారు. 

దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ... విద్యాలయాల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. గంజాయి నిర్మూలనకు ఇప్పటికే ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని అన్నారు. ట్రిపుల్ ఐటీలో సమస్యను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్ ను కాపాడతానని భరోసా ఇచ్చారు.
Nara Lokesh
Idupulapaya IIIT
Ganja
Students
Parents
TDP-JanaSena-BJP Alliance

More Telugu News