యూపీలో భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన 'ఆవాస్ యోజన' డబ్బులు!
- యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లాలోనే 11 కేసుల నమోదు
- మొదటి విడతగా రూ.40 వేలు మంజూరు చేసిన ప్రభుత్వం
- ఇదే సమయంలో ప్రియులతో వెళ్లిన వివాహితలు
యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఇటీవల 2,350 మందికి ఈ పథకం కింద నగదు విడుదలైంది. తొలి విడతగా రూ.40 వేల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యింది. అయితే, ఇదే సమయంలో తమ భార్యలు వేరేవారితో వెళ్లిపోయారని పోలీసులకు కొంతమంది ఫిర్యాదు చేశారు. ఈ ఒక్క జిల్లాలోనే ఇలాంటివి 11 కేసులు నమోదయ్యాయి. దీంతో రెండో విడత నగదును నిలిపివేయాలని నిర్ణయించినట్లుగా అధికారులు తెలిపారు.