Ponnam Prabhakar: నేనేమీ అల‌గ‌లేదు.. ఆ వార్త‌ల్లో నిజం లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్‌

Minister Ponnam Prabhakar Explanation on Issue of Balkampet Yellamma Temple
  • బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకల‌కు హాజ‌రైన‌ మంత్రి పొన్నం, మేయర్‌ విజయలక్ష్మి
  • మంత్రి వెళ్లిన స‌మ‌యంలో స్వ‌ల్ప తోపులాట‌
  • దాంతో ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై ఆగ్రహం 
  • ప్రొటోకాల్‌ పాటించడం లేద‌ని అలిగి ఆలయం బయటే కూర్చుండిపోయిన మంత్రి
  • అయితే, తాను అల‌గ‌లేదంటూ తాజాగా వివ‌ర‌ణ‌
హైదరాబాద్‌ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకల‌కు హాజ‌రైన‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కార్య‌క్ర‌మం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే. ప్రొటోకాల్‌ పాటించడం లేద‌ని అలిగి మంత్రి ఆలయం బయటే కూర్చుండిపోయినట్టు వార్తలొచ్చాయి. అయితే, తాజాగా ఈ విష‌య‌మై మంత్రి స్పందించారు. 

తాను అలిగిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌న్నారు. అమ్మ‌వారి భక్తులు ఎందుకు అలుగుతామ‌న్నారు. మ‌హిళ‌లు వెళ్లే స‌మ‌యంలో తోపులాట జ‌రిగింద‌ని తెలిపారు. దాంతో మేయ‌ర్ కూడా తోపులాట‌లో ఇబ్బంది ప‌డ్డార‌ని అన్నారు. తోపులాట‌ను నిలువ‌రించేందుకు కొద్దిసేపు ఆగిన‌ట్లు మంత్రి పొన్నం తెలిపారు. 

తోపులాట‌పై అధికారుల‌ను ప్ర‌శ్నించిన‌ట్లు చెప్పారు. మహిళా రిపోర్టర్‌కు ఎదురైన చేదు అనుభ‌వానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అలాగే ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు.    
Ponnam Prabhakar
Balkampet Yellamma Temple
Hyderabad
Telangana

More Telugu News