Lionel Messi: ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీకి ఉక్కు కవచం ఈ బాడీగార్డ్.. వీడియో ఇదిగో!

Lionel Messi Bodyguard Goes Viral For Swiftly Protecting The Football Star
  • వేయి కళ్లతో బాస్ ను కాపాడుకుంటున్న యాసిన్ చ్యూకో
  • ప్రతీక్షణం అప్రమత్తంగా ఉంటూ మెస్సీపై చేయి పడకుండా జాగ్రత్త
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఫుట్ బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు బాడీగార్డ్ అలర్ట్ నెస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన బాడీగార్డ్ గా మెస్సీ సరైన వ్యక్తిని ఎంచుకున్నారని, అతడి నుంచి చిన్న చీమ కూడా తప్పించుకోలేదని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఫుట్ బాల్ మ్యాచ్ ల సందర్భంగా మెస్సీ అభిమానుల దుందుడుకు చర్యలను సదరు బాడీగార్డ్ ఎలా నిలువరించాడనేది కనిపిస్తోంది.

 మెస్సీకి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే.. ఆయనను దగ్గరి నుంచి చూడాలని, మెస్సీ చేతిని తాకాలని కొంతమంది వీరాభిమానులు ఎంతకైనా తెగిస్తారు. మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి దూసుకొస్తారు.
అలాంటి వారి వల్ల మెస్సీకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దీనిని నివారించేందుకు మెస్సీ బాడీగార్డ్ యాసిన్ చ్యూకో నిరంతరం అప్రమత్తంగా ఉంటాడు. 

మైదానంలో మెస్సీ పరుగులు పెడుతుంటే మైదానం వెలుపల చ్యూకో పరుగెడుతుంటాడు. గ్రౌండ్ నలుమూలలా పరీక్షించి చూస్తూ వీరాభిమానులను మెస్సీ దగ్గరికి వెళ్లకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటాడు. ఈ విషయంలో చ్యూకో అలర్ట్ నెస్ మామూలుగా లేదు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అన్నట్టు.. యాసిన్ చ్యూకోకు కూడా సోషల్ మీడియాలో సెలబ్రిటీ స్టేటస్ ఉంది. ఇన్ స్టాలో ఆయనను ఏకంగా 1.75 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అమెరికా సైన్యంలో పనిచేసిన చ్యూకోను ఇంటర్ మియామి క్లబ్ ప్రెసిడెంట్ డేవిడ్ బెక్ హామ్ సలహాతో మెస్సీ తన పర్సనల్ గార్డ్ గా నియమించుకున్నాడట.
Lionel Messi
Bodyguard
Football
Viral Videos

More Telugu News