Telugu student: అమెరికాలో ప్రమాదవశాత్తూ తెలుగు విద్యార్థి మృత్యువాత

Telugu student died after falling into a waterfall in America
  • జలపాతంలో పడి దుర్మరణం
  • పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన విద్యార్థి అవినాశ్ మృతి
  • అక్క వద్ద ఉంటూ అమెరికాలో ఎంఎస్ చేస్తున్న అవినాశ్
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. గద్దే సాయిసూర్య అవినాశ్ అనే 26 ఏళ్ల విద్యార్థి సోమవారం ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి చనిపోయాడు. అవినాశ్ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాలకు చెందినవాడు. అమెరికాలోనే ఉంటున్న తన అక్క వద్ద ఉంటూ అక్కడ ఎంఎస్ చదువుతున్నాడు.

ఆదివారం సెలవు దినం కావడంతో అక్క కుటుంబ సభ్యులతో కలసి ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్లారు. ఇరు కుటుంబ సభ్యలు సమీపంలోని జలపాతానికి వెళ్లారు. అంతా సరదాగా గడుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ అవినాశ్ నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అవినాశ్ మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు పేర్కొన్నారు.

కొడుకు మరణవార్త విని తల్లిదండ్రులు గద్దే శ్రీనివాస్‌, శిరీష కన్నీరుమున్నీరవుతున్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి ఇలా చనిపోవడం కలచివేస్తోందని బంధువులు, స్నేహితులు విచారం వ్యక్తం చేశారు. అవినాశ్ ఎంఎస్ చదివేందుకు 2023 జనవరిలో అమెరికా వెళ్లాడని చెప్పారు. కాగా నెలక్రితం ఇద్దరు తెలుగు విద్యార్థులు కూడా ప్రమాదవశాత్తూ జలపాతం నీటిలో పడిపోయారు. మెడిసిన్ చదివేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Telugu student
Died
USA
Andhra Pradesh

More Telugu News