Menstrual Leave: నెలసరి సెలవులు ఇవ్వాలంటూ బలవంతం చేస్తే, మహిళలకు ఉద్యోగావకాశాలు తగ్గే ప్రమాదం: సుప్రీంకోర్టు

Mandatory Menstrual Leave May Reduce Women Workforce Says Supreme Court
  • మహిళలకు నెలసరి సెలవులు ఇస్తున్న కేరళ, బీహార్
  • అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో పిల్
  • అది విధానపరమైన అంశమన్న అత్యున్నత న్యాయస్థానం
మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ప్రస్తుతం రెండు రాష్ట్రాలు మాత్రమే నెలసరి సెలవులు ఇస్తున్నాయని, మిగతా రాష్ట్రాలు కూడా దీనిని పాటించేలా ఆదేశాలివ్వాలంటూ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

ఈ పిల్‌ను నిన్న విచారించిన కోర్టు.. నెలసరి సెలవులు ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను సమర్థిస్తూనే.. ఇది వారి ఉద్యోగావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలకు నెలసరి సెలవులు అనేది విధానపరమైన అంశమని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. 

నెలసరి సెలవులు ఇవ్వాల్సిందేనంటూ యాజమాన్యాలను బలవంతం చేస్తే మహిళలను నియమించుకునే విషయంలో పునరాలోచిస్తారని, ఇది వారి ఉద్యోగావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. కాగా, దేశంలో కేరళ, బీహార్‌లో మాత్రమే నెలసరి సెలవులు ఇస్తున్నారు.
Menstrual Leave
Supreme Court
CJI Chandrachud

More Telugu News