మరోమారు పేట్రేగిన ఉగ్రవాదులు.. అమరులైన ఐదుగురు జవాన్లు
- జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఘటన
- పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గ్రనేడ్ విసిరిన ఉగ్రవాదులు
- వాహనం ఆగడంతో కాల్పులకు తెగబడిన ముష్కరులు
- మరో ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలు
కథువా జిల్లాలోని మాచేడి-కిండ్లీ- మల్హర్ రోడ్డు మార్గంలో కాపుకాసిన ఉగ్రవాదులు పక్కా ప్రణాళిక ప్రకారం దాడికి తెగబడ్డారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆర్మీ కాన్వాయ్‌పైకి తొలుత గ్రనేడ్ విసిరారు. దీంతో వాహనం ఆగడంతో కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కాల్పులతో అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ఉగ్రవాదులు పరారయ్యారు. సమాచారం అందుకున్న అదనపు బలగాలు అక్కడికి చేరుకుని ఉగ్రవాదుల కోసం కూంబింగ్ జరుపుతున్నాయి.