Revanth Reddy: రేవంత్ రెడ్డికి మెమొంటో ఇచ్చిన వైఎస్ షర్మిల

Sharmila gifted Memento to Revanth Reddy
  • వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఇచ్చిన షర్మిల
  • మంగళగిరిలో వైఎస్ 75వ జయంతి వేడుకలు
  • పాల్గొన్న ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన వైఎస్ 75వ జయంతి వేడుకలకు హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మెమొంటోను ఇచ్చారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి సభ నిర్వహించారు.

ఈ సభకు ఏపీకి చెందిన పార్టీ నాయకులతో పాటు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పలువురు తెలంగాణ మంత్రులు హాజరయ్యారు. కార్యక్రమం ముగియడానికి ముందు షర్మిల, కేవీపీ రామచంద్రరావు కలిసి తెలంగాణ సీఎంకు శ్రీవెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని బహూకరించారు.
Revanth Reddy
YS Sharmila
Telangana
Andhra Pradesh

More Telugu News