Nara Lokesh: బడి కోసం పాక కట్టారని సోషల్ మీడియా ద్వారా తెలిసింది: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh reacts after knowing tribal built a hut for school in Kinduguda
  • మన్యం జిల్లా కిండుగూడ గ్రామస్తులను అభినందించిన మంత్రి లోకేశ్
  • పాఠశాల కోసం పాక నిర్మించిన గిరిజనులు
  • పక్కా భవనం నిర్మిస్తామని లోకేశ్ హామీ  
పార్వతీపురం మన్యం జిల్లా కిండుగూడ గ్రామస్తులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అభినందించారు. కిండుగూడ ఓ గిరిజన గ్రామం. అక్కడ పాఠశాల కోసం ఎలాంటి భవనాలు లేవు. దాంతో, కిండుగూడ గ్రామంలో గిరిజనులు శ్రమదానం చేసి బడి కోసం ఓ పూరి పాకను నిర్మించారు. 

దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పాఠశాల కోసం పూరి పాక నిర్మించారని సోషల్ మీడియా ద్వారా తెలిసిందని, బడి కోసం గిరిజనులు చేసిన కృషి అభినందనీయం అని పేర్కొన్నారు. కిండుగూడలో పాఠశాలకు పక్కా భవనం నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 
Nara Lokesh
Kinduguda
Tribal
Hut
School
Parvathipuram Manyam District
TDP
Andhra Pradesh

More Telugu News